బొలిశెట్టిపై చర్యలకు డిమాండ్
జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ విశాఖ ఉక్కు కార్మికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కార్మిక వర్గాల మండిపడుతున్నాయి. గురువారం ఏఐటీయూసీ నాయకులు విశాఖలో భేటీ అయ్యారు. ఉక్కు యూనియన్ నాయకులందరూ వెధవలు, దొంగలు, అమ్ముడుపోయారు అంటూ బొలిశెట్టి వ్యాఖ్యలపై మండిపడ్డారు. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మన్మధరావు హెచ్చరించారు.