నగరి : జాతీయ గణిత దినోత్సవ వేడుకలు
పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం గణిత మేధావి రామానుజం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏజీఎం సురేష్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ గణిత రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు గోపి రామానుజాన్ని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.