నగిరి: పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ బుధవారం నగిరి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురి ప్రజలతో మాట్లాడారు. అనంతరం పట్టణంలోని డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్సిసి క్యాడెట్లు గౌరవ వందనం చేశారు. కళాశాల అధ్యాపక బృందం ఆయనకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని ఎమ్మెల్యే తెలియజేశారు.