సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న వంట నూనె ధరలు
ముడి, రిఫైన్డ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో పామ్ ఆయిల్, సోయా, పొద్దుతిరుగుడు నూనె ధరలు పెరగనున్నాయి. గతంలో రిఫైన్డ్ పామ్ ఆయిల్, సోయా, పొద్దుతిరుగుడు నూనెపై 12.5 శాతం దిగుమతి ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు వీటిపై 32.5 శాతం దిగుమతి సుంకం పడనుంది. మొత్తంగా ముడి నూనెలపై సుంకం 5.5 నుంచి 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై సుంకం 13.75 నుంచి 35.75 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.