రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు.. షాకింగ్ వీడియో
మధ్యప్రదేశ్లోని మైహార్లో షాకింగ్ ఘటన జరిగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా సత్నా జిల్లాలోని మైహార్లో ఉన్న శారదా మాతను దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ నెల 10 జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. మైహార్ స్టేషన్లో జబల్పూర్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న మహాకౌశల్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి 26 ఏళ్ల వికాష్ అహిర్వార్ అనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.