మహబూబ్ నగర్: సంక్రాంతికి 320 బస్సులు
పాలమూరు ఉమ్మడి జిల్లాలో 10 ఆర్టీసీ డిపోల పరిధిలో ఈనెల 13 వరకు హైదరాబాద్ కు 320 బస్సులు అదనంగా నడపనున్నాట్లు రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవద్దని ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.