మహబూబ్ నగర్: స్వామివారిని దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలో ప్రసిద్ధిగాంచిన పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామిని, మల్దకల్ గట్టు తిమ్మప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కృష్ణాచారి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎంపీని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.