నాగర్ కర్నూలు: ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులైన వారికి లబ్ధి చేకూరాలి
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని చారగొండ మండలంలోని జూపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.