కల్వకుర్తిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కల్వకుర్తిలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వివిధ చర్చిలలో ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసు చూపిన మార్గంలో నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ సర్పంచి ఆనందకుమార్, నాయకులు, వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు.