నాగర్ కర్నూల్: గ్రంధాలయానికి కపిలవాయి లింగమూర్తి పేరు పెట్టాలి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయం భవనానికి ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి పేరు పెట్టాలని వెన్నెల సాహిత్య అకాడమీ సభ్యులు గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను గ్రంధాలయ శాఖ అధికారులకు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దినకర్, కాశన్న, మోహన్ ఆనంద వర్ధన్, బంగారయ్య, తదితరులు పాల్గొన్నారు.