గజ్వేల్: రోడ్లపై ధాన్యాన్నిపోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దు
రోడ్లపై ధాన్యాన్ని పోసి ఇతరుల మరణానికి కారణం కావొద్దని గజ్వేల్ సిఐ సైదా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై ధాన్యం పోయడం వలన వాహనదారులు రాత్రి సమయాల్లో అది గమనించక ప్రమాదం జరిగి చనిపోతున్నారన్నారు. బావి దగ్గర ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.