లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ
ఈ నెల 28న ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్ ను మండలంలోని కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ బొజ్జమాహేష్ అన్నారు. గురువారం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో సమస్యను సత్వరంగా పరిష్కరించుకోవచ్చని, కక్షిదారులు రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్, సివిల్, చిన్న చిన్న కుటుంబకలహాలు, సరిహద్దు వివాదాలు, దొమ్మి కేసులు మొదలైన వాటి రాజీకి లోక్ అదాలత్ రాజమార్గం అన్నారు.