సైబర్ మోసం... రూ. 50 వేలు అపహరణ
సైబర్ నేరగాళ్ల చేతిలో నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మోసపోయాడు. మండల కేంద్రానికి చెందిన ఉపేందర్ కు స్థానిక బ్యాంక్ లో ఖాతా ఉండగా, రూ. 50, 300 వరకు నగదు ఉంది. ఆయన మంగళవారం ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వెళ్లగా బ్యాలెన్స్ రూ. 300 మాత్రమే చూపించింది. దీంతో బాధితుడు బ్యాంకు అధికారులను సంప్రదించగా, మహారాష్ట్రకు చెందిన సైబర్ నేరగాళ్లు ఆయన ఖాతాను హ్యాక్ చేసి డబ్బు డ్రా చేసినట్లు తేలింది.