గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ, తహశీల్దార్
ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల మున్నేరు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఏసీపీ తిరుపతిరెడ్డి, మండల తహశీల్దార్ పరిశీలించారు. గణేష్ విగ్రహ నిమజ్జనం చేసే ప్రదేశాల వివరాలు, ఏర్పాట్లను జిల్లా కాంగ్రెస్ నేత బోడా వెంకన్నను అడిగి తెలుసుకున్నారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజు, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.