బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన సిద్ధం చేయండి
ఆళ్లపల్లి మండలంలోని లొద్దిగూడెం గ్రామం నుంచి మర్కోడు వెళ్లే మార్గమధ్యలో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు కొట్టుకుపోయింది. శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించారు. శాశ్వత పరిష్కారం కోసం బ్రిడ్జి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.