టేకులపల్లి: హామీల అమలులో ప్రభుత్వం కాలయాపన
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం చెందిందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు బుధవారం అన్నారు. రైతు రుణమాఫీ చేయడంలో అనేక కొర్రీలు పెడుతుందని, రైతు భరోసా అమలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల నేతలు పాల్గొన్నారు.