టేకులపల్లి: పొక్సో కేసు నమోదు
బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి ఎస్సై పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు. గంగారం పంచాయతీ సంపత్ నగర్ గ్రామానికి చెందిన ఎం. శివ(29), ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక(13)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి యువకుడు పరారైనట్లు ఎస్సై తెలిపారు.