ఎన్నికల అకౌంటింగ్ టీమ్ ఆఫీసును పరిశీలించిన కలెక్టర్
భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలోని ఎన్నికల అకౌంటింగ్ టీమ్ ఆఫీసును సోమవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ఇంత నగదు ఎంత సీజ్ చేశారు, ఎంత రిలీజ్ చేశారు అనే వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజకీయ పార్టీల అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, ప్రచార ఖర్చులు, ఇతర ఖర్చులకు సంబంధించి ప్రత్యేక రిజిష్టర్ మెయింటనెన్స్ చేయాలన్నారు.