దేవరకద్ర: గ్రామ సభలో గ్రామస్తుల ఆందోళన.!
దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం బలిదుపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అర్హులైన వారికి ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయలేదని కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరగ లేదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని వారు ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు గ్రామ సభలో గందరగోళం చేశారు.