మహబూబ్ నగర్: లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 38వ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వారి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పోల శ్రీనివాస్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.