కొత్తకోటలో సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్ పర్యటన
దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండల కేంద్రం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3: 00 గంటలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పంపిణీ చేయనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మండల నేతలు కోరారు.