జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరా గాంధీ
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలం యన్మన్ గండ్లలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని మంగళవారం రాష్ట్ర సేవాదళ్ సెక్రటరీ హమీద్ మహేక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ఉక్కు మహిళ, భారతదేశ తొలి మహిళా ప్రధానిగా చేసింది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆమె పాటుపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోస్గి కాశమ్మ, మార్కెట్ డైరెక్టర్ జమ్మూ తదితరులు పాల్గొన్నారు.