జైనూర్: రైతుల సమస్యల పరిష్కారానికి కొత్త పాలకవర్గం కృషి చేయాలి
జైనూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ బాధ్యతలు చేపట్టిన ప్రతీ ఒక్కరు రైతుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ ఆత్రం సుగుణక్క కోరారు. జైనూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో గురువారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సుగుణక్క హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రైతు కూడా బాధపడకుండా చూడాల్సిన బాధ్యత పాలకవర్గం తీసుకోవాలన్నారు.