రైతుల సంక్షేమానికి కృషి చేస్తా
రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. గజ్వేల్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఘనంగా సన్మానించారు. సమావేశంలో డైరెక్టర్లు హరినాథ్ గుప్తా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.