హుజూర్ నగర్: మానవత్వం చాటుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్
బీహార్ కు చెందిన జితేందర్ హుజూర్ నగర్ లోని బస్తాల కంపెనీలో వర్కర్ గా పనిచేస్తున్నాడు. కాగా ఆయన భార్య జయంతి దేవి గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందింది. అంత్యక్రియలకు డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో ఉండగా విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి స్పందించి జితేందర్ పనిచేసే యజమానితో మాట్లాడి అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను యజమాని ద్వారా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఉన్నారు.