అనుముల తహశీల్దార్ అరెస్ట్
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ రైతుబంధు కుంభకోణంలో అనుముల తహశీల్దార్ జయశ్రీని పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36. 23 ఎకరాల భూమికి ధరణి ద్వారా అక్రమంగా పాసుపుస్తకాలు పొంది రైతుబంధు ద్వారా 14, 63, 004 రూపాయలను కాజేయడంతో తహసిల్దార్ తో పాటు, ధరణి ఆపరేటర్ ను అరెస్ట్ చేశారు. తహసిల్దార్ పై 420, 406, 409, 120(బి), 468, 467 ఐపిసి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.