భైంసా: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ మారుతి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చింతలబోరి గ్రామానికి చెందిన సోనారి గంగాధర్ (42) మద్యం, పేకాటకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి అతని భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.