ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
పిట్లం మండల కేంద్రంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం ఆమె ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. పట్టణ అధ్యక్షులు సాయిలు, ఉప అధ్యక్షులు దుర్గయ్య, సలహాదారులు శివ, అశోక్ రాజ్, కేశయ్య, సిద్దు, రవి, బాలు, లడ్డు, గణేశ్వర్, అఖిల్, హన్మండ్లు, పండరి, రాశేఖర్, సంగయ్య, తదితరులు పాల్గొన్నారు.