నాగర్ కర్నూలులో వీధి కుక్కల స్వైర విహారం (వీడియో)
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వాస్పత్రి లోపలికి వీధి కుక్కలు వచ్చాయి. అవి ఆస్పత్రి ప్రాంగణంలో తిరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో సిబ్బంది తీరుపై రోగులు మండిపడుతున్నారు. కుక్కలు ఎప్పుడు ఎవరిపైనా దాడి చేస్తాయోనని భయాందోళనలకు గురవుతున్నారు.