వికారాబాద్
వికారాబాద్: అధికారులపై దాడి ఘటన.. పోలీసుల అదుపులో 55 మంది
ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ నిమిత్తం వికారాబాద్ జిల్లా లగచర్లలో సోమవారం గ్రామసభ నేపథ్యంలో అధికారులపై గ్రామస్థులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్టు చేశారు. దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.