వేములవాడ: ప్రాజెక్టులను ముందస్తుగా నీటితో నింపండి: ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాజెక్టులకు సాగునీరు అందించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ నెల ఆఖరి వరకు సాగునీరు అందించాలని తద్వారా నియోజకవర్గంలోని మల్కాపేట, ఫాజుల్ నగర్, చందుర్తి ప్రాజెక్టు, జోగపూర్ చెరువులను నీటితో నింపాలిసిందిగా పేర్కొన్నారు.