వేములవాడ బీసీ సంక్షేమ హాస్టల్ ఆకస్మిక తనిఖీ
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆరా తీశారు. వేములవాడ పట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాస్టల్ లోని విద్యార్థుల వసతి గదులు, ఆవరణ, పరిసరాలు, స్టోర్ రూం, కిచెన్ గదిని పరిశీలించారు. రోజూ మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా? అని ఆరా తీశారు.