జ్యేష్ట మాసంలో ఈ ఆహారం వద్దు
పంచాంగం ప్రకారం ఈ ఏడాది జ్యేష్ట మాసం మే 20 నుంచి ప్రారంభమై జూన్ 18న ముగుస్తుంది. అయితే, ఈ కాలంలో మంచి ఆహారం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అధిక నూనె - మసాలా, వేయించిన ఆహారాలు, మాంసాహారం తినకూడదు. ఎక్కువ పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలుండాలంటున్నారు. స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. వంకాయను ముట్టుకోకూడదని, బెండకాయ తింటే సంతానానికి సమస్యలు వస్తాయంటున్నారు.