మళ్లీ థియేటర్లలోకి రానున్న హార్ట్ టచ్చింగ్ లవ్ మూవీ 'జర్నీ'
ఎమోషనల్ లవ్ మూవీ జర్నీ సినిమా రీ-రిలీజ్కు సిద్ధమైంది. పన్నెండేళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. అంజలి, జై, శర్వానంద్, అనన్య ప్రధాన పాత్రల్లో ఎం.శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జర్నీ’ మూవీ 2011లో విడుదలైంది. ఈ మూవీని సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నారు. రేపటి నుండి టికెట్స్ బుకింగ్ షురూ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.