భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్
ఎంవీపీ కాలనీలో శనివారం రాత్రి భార్యను హత్య చేసిన సంఘటనలో భర్త డానియేల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కాకినాడకు చెందిన సలోమిని 2008లో డానియేల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దికాలంలో భార్యపై అనుమానంతో హింసించాడు. శనివారం రాత్రి చున్నీతో ఉరేసి హత్య చేశాడు. డానియల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.