కోటవురట్లలో తాగునీటి కోసం ఇక్కట్లు
మేజర్ పంచాయతీ అయిన కోటవురట్లలో సంతబయల పరిసర ప్రాంతాలలో.. కాలనీవాసులు గత పది రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 90, 000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు వరాహ నదిలో ఉన్న వాటర్ పైప్లైన్ పగిలిపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం కాలనీ వాసులు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.