చినుకు పడితే చిత్తడే
సోమందేపల్లి మండలం కేతగానిచేరువు యస్సీ కాలనీలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి వర్షపు నీరు నిల్వ ఉండి చిత్తడి చిత్తడి గా మారింది. స్థానికులు మాట్లాడుతూ సీసీ రోడ్డు మరమ్మత్తులు కోసం కాంట్రాక్టర్ మట్టిని ఎత్తుగా తోలడంతో వర్షపు నీరు ఎక్కడికి పోకుండా ఇంటి ముందు నిల్వ వుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైన అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.