రేపు అనంతపురంలో సందడి చేయనున్న సినిమా తారలు
సినీ హీరోయిన్లు పాయల్ రాజ్పుత్, నబా నటేశ్ శుక్రవారం అనంతపురం రానున్నారు. నగరంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారు పాల్గొంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లను నిర్వాహకులు సిద్ధం చేశారు. తమ అభిమాన హీరోయిన్లు వస్తుండటంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.