జిజిహెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పులివెందులలో నూతనంగా ఏర్పాటు చేసిన జిజిహెచ్, మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు, ఓపి, ఐపి బ్లాకులు, ఎమర్జెన్సీ వార్డులతో పాటు. పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ఏపీఎంఎస్ఐడిసి కల్పించే సదుపాయాలు, అలాగే వైద్య సిబ్బంది సంఖ్య తదితర వివరాలను సంబందిత ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు.