
నిజాంపట్నం: మనస్పర్ధలు కారణంగానే భర్తపై భార్య దాడి
నిజాంపట్నం మండలం కొత్తపాలెం భర్త పై భార్య దాడి చేయడంతో భర్త అమరేంద్ర బాబు (38) అక్కడక్కడే మృతి చెందాడు. మృతుడు గతంలో హోం గార్డు గా విధులు నిర్వహించి ప్రస్తుతం పెయింటర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం మృతుడి భార్య అరుణ తన తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.