ఆటో నుండి జారిపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
చంద్రగిరి మండలం, మల్లయ్యపల్లికి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి తిరుపతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో పనిచేస్తుంటాడు. సోమవారం డ్యూటీ ముగించుకుని చంద్రగిరికి వస్తుండగా తొండవాడ సమీపంలోని నందిని హోటల్ దగ్గర ఆటో నుండి జారిపడి తలకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చంద్రగిరి 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.