
తాడేపల్లిగూడెం: మత్స్యకారుల జీవనోపాధికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు
తాడేపల్లిగూడెం మండలం వెంకట రామన్నగూడెంలోని మైనర్ ఇరిగేషన్ చెరువుల నందు పీఎంఎస్ఎస్వై పథకం ద్వారా చేప పిల్లల విడుదల కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో 12 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో పీఎం మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 6 లక్షల కట్ల, రోహు, మ్రిగాలా చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందన్నారు.