
తాడేపల్లిగూడెం: అంగన్వాడీ కేంద్రాల సమయ వేళలు మార్పు
వేసవి ఎండల దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల సమయ వేళలు మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఐసీడీఎస్ తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ అధికారిణి టి. లక్ష్మీ సరస్వతి తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రీ స్కూల్ నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం కచ్చితంగా అమలు చేయాలన్నారు.