చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నూతన సంవత్సరం రోజున బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మార్టూరు జాతీయ రహదారి రక్తమోడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు మార్టూరు వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహిళను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.