నందిగం సురేష్ పై తుళ్లూరు పోలీసుల పీటీ వారెంట్
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ పై తుళ్లూరు పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2020లో మండలంలోని వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ మృతి చెందింది. అప్పట్లో ఓ సామాజిక వర్గం రోడ్డుపై బైఠాయించి నందిగం సురేష్ పేరును ఎఫ్ఎఆర్ లో చేర్చాలని ధర్నా కూడా చేశారు. సదరు కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.