మానవ అక్రమ రవాణా పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్ వెంకట మురళి
బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం గ్రామీణ సాంఘిక విమోచన సేవ సంస్థ (రోజ్) ఆధ్వర్యంలో"మానవ అక్రమ రవాణా విముక్తి కొరకు పరుగు"పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ సాంఘిక విమోచన సేవ సంస్థ చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి రాజ్ దేబోరా, రోజ్ సేవ సంస్థ సెక్రెటరీ పొందుగల ప్రసాద్ పాల్గొన్నారు.