బాపట్లలో స్వచ్చ భారత్ ర్యాలీ ప్రదర్శన...
బాపట్ల పట్టణంలోని సఖి వన్ స్టాప్ సెంటర్ (మహిళా శిశు సంక్షేమo) ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ 4. 0 ర్యాలీ కార్యక్రమం జరిగింది. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ర్యాలీలో ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఏరియా హాస్పటల్ సూపరండెట్ డాక్టర్ సిద్ధార్థ, ఐ సి డి ఎస్ పి డి ఉమా, అడ్మినిస్ట్రేటర్ ఉషారాణి, సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.