రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
కమలాపురం మండల పరిధిలోని రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించి, వ్యవసాయంలో లాభం వచ్చేలా చూడాల్సిన బాధ్యత గ్రామ వ్యవసాయ సహాయకులపై ఉందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు నరసింహారెడ్డి అన్నారు. బుధవారం కమలాపురం ఎడి కార్యాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లకు వ్యవసాయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి శిక్షణ ఇచ్చారు. ఏడి మాట్లాడుతూ.. రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించి వారికి అందుబాటులో ఉండాలన్నారు.