
మలికిపురం: వినూత్నంగా విద్యార్థుల మానవహారం
డిసెంబర్ 22 గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలలో భాగంగా శనివారం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం వివేకానంద పాఠశాల విద్యార్థులు రామానుజన్ నెంబర్ 1729 రూపంలో మానవహారంగా ఏర్పడడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు గణిత నాటికలు, గణిత పాటల నృత్యాలు, గణిత క్విజ్ పోటీలు నిర్వహించారు.