పామర్రు: పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలి
ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని తోట్లవల్లూరు తహసీల్దార్ కుసుమకుమారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఓటర్లుగా పేర్లు నమోదుకు నవంబరు 6వ తేదీ వరకు గడువు ఉందని అవసరమైన పత్రాలను ఆయా మండలాల్లోని తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని వివరించారు.